Chiranjeevi: ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది.. చర్చకు దారి తీస్తున్న చిరంజీవి వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి.. ఆయన అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన చిరంజీవిని ఎంతో మంది గౌరవిస్తారు.
ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది.. చర్చకు దారి తీస్తున్న చిరంజీవి వ్యాఖ్యలు
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఆయన అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన చిరంజీవిని ఎంతో మంది గౌరవిస్తారు. ఆదర్శంగా తీసుకుంటారు. అయితే ఎంతటి వారైన సరే ఒక్కోసారి వారు మాట్లాడిన తీరు విమర్శలకు దారి తీస్తుంది. తాజాగా చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన బ్రహ్మ ఆనందం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి హాజరయ్యారు. అయితే యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు చిరంజీవి మాట్లాడుతూ.. ఇంట్లో తన పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది. నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే.. చరణ్ ని ఒక్కోసారి అడుగుతుంటాను.. దయచేసి ఈ సారి ఒక అబ్బాయిని కనురా.. మన లేగసీని ముందుకు కొనసాగించాలి. మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది అని నవ్వుతూ అన్నారు. అయితే చిరంజీవి మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి.
సోషల్ మీడియాలో చిరంజీవి మాటలు వైరల్ కావడంతో కొందరు తప్పుగా పరిగణిస్తున్నారు. అబ్బాయి పుట్టాలి అన్న ఉద్దేశంలో తప్పు లేదు. కానీ ఆడపిల్లలు తమ లేగసీని కొనసాగించలేరు అనే అభిప్రాయం కొంతమందికి నచ్చడంలేదు. చిరంజీవి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మెగాస్టార్ మాటలు కేవలం ఇంట్లో తన మనవరాళ్లతో తన పరిస్థితి గురించి చమత్కారంగా అన్నారే తప్ప ఆయన మహిళలను ఎంతో గౌరవిస్తారని.. అది ఆయన అభిప్రాయం కాదని అంటున్నారు.
మొత్తానికి చిరంజీవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే దీనిపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.