దిల్ రాజు పై మండిపడుతున్న నెటిజన్లు

Netizens: *పెద్ద సినిమాలకి అదే స్ట్రాటజీ వాడుతున్న దిల్ రాజు

Update: 2022-04-14 14:00 GMT

దిల్ రాజు పై మండి పడ్తున్న నెటిజన్లు

Netizens: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో లేక డిస్ట్రిబ్యూటర్ల లో దిల్ రాజు పేరు ముందే ఉంటుంది. నైజాం ఏరియాలో దిల్ రాజు కి తిరుగులేదు. ఇప్పటికే దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన చాలా సినిమాలు నైజం ఏరియాల్లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆఖరికి నిన్న గాక మొన్న విడుదలైన "ఆర్ ఆర్ ఆర్" సినిమా కూడా నైజాం ఏరియాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే నైజాం ఏరియాలో భారీ కలెక్షన్లు నమోదు చేయడానికి దిల్ రాజు వాడే ఒక స్ట్రాటజీ ఉంది. అదే టికెట్ రేట్ల పెంపు. మిగతా అన్ని చోట్లా "ఆర్ఆర్ఆర్" సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సెంటర్లలో కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.

అయినా సరే దిల్ రాజు మాత్రం నైజాం ఏరియాలో పెద్ద సినిమాల టికెట్ రేటు తగ్గించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఆఖరికి ఈ మధ్యనే విడుదలైన డబ్బింగ్ సినిమా "బీస్ట్" కి కూడా భారీ రేట్లు ఫిక్స్ చేశారు థియేటర్ ఓనర్ లు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తమిళనాడు కంటే హైదరాబాద్ లోనే సినిమా టికెట్ రెట్ ఎక్కువ. ఇక ఇవాళ విడుదలైన కే జి ఎఫ్ చాప్టర్ 2 విషయంలో కూడా అదే స్ట్రాటజీ రిపీట్ చేస్తున్నారు దిల్ రాజు. "ఆర్ ఆర్ ఆర్" రేంజ్ లో టికెట్ రేట్లను భారీగా పెంచేశారు. దీంతో నెటిజన్లు దిల్ రాజు పై మండిపడుతున్నారు.

Tags:    

Similar News