NBK : బాలయ్యని చూస్తే.. వేరే లెవల్ ఎనర్జీ వస్తుంది – మ్యూజిక్ డైరెక్టర్ తమన్

నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ అరుదైన మైలురాయిని గుర్తిస్తూ ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్–యూకే గోల్డ్ ఎడిషన్లో స్థానం దక్కించుకుంది. భారతీయ సినీ పరిశ్రమలో ఈ గౌరవం పొందిన తొలి హీరోగా బాలయ్య నిలిచారు.

Update: 2025-08-31 05:45 GMT

NBK : బాలయ్యని చూస్తే.. వేరే లెవల్ ఎనర్జీ వస్తుంది – మ్యూజిక్ డైరెక్టర్ తమన్

నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ అరుదైన మైలురాయిని గుర్తిస్తూ ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్–యూకే గోల్డ్ ఎడిషన్లో స్థానం దక్కించుకుంది. భారతీయ సినీ పరిశ్రమలో ఈ గౌరవం పొందిన తొలి హీరోగా బాలయ్య నిలిచారు. శనివారం నిర్వహించిన ఘన కార్యక్రమంలో బాలకృష్ణను సత్కరించారు. ఈ వేడుకకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో పాటు దర్శకులు బోయపాటి, బాబీ, గోపీచంద్ మలినేని, పలు రాజకీయ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ –

“బాలయ్యతో పని చేస్తే నేను వేరే ప్రపంచంలోకి వెళ్లిపోతాను. ‘అఖండ’కి ముందు–తరువాత అన్నట్టుగా నా మ్యూజిక్‌లో భారీ మార్పు వచ్చింది. నిజంగా బాలయ్య బాబుగారు నా సంగీతానికి కొత్త ఊపిరి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆయనతో పని చేయడం నాకు గుడికి వెళ్లినట్టే అనిపిస్తుంది. బాలయ్యని చూస్తే మాటలు రావు, అంతటి ఎనర్జీ వస్తుంది. నిజంగా ఏదో శక్తి నా చేతుల్లోకి చేరినట్టు అనిపిస్తుంది. మా వాళ్లు కూడా అడుగుతారు– ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని! బాలయ్య సినిమాకి పని చేస్తే ఆ ఆరా పూర్తిగా వేరే లెవల్‌లో ఉంటుంది” అని ఆనందం వ్యక్తం చేశారు.

అలాగే, “ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మాత్రమే కాదు.. రాబోయే ‘అఖండ 2’ కూడా కొత్త రికార్డులు సృష్టించబోతోంది” అని తమన్ నమ్మకం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News