Nani29 - Dasara Movie: తన 29వ సినిమా "దసరా" అంటూ జమ్మి వెట్టి చెప్పిన నాని
* దసరా సందర్భంగా తన 29వ సినిమా టైటిల్ ని విడుదల చేసిన నాని
Nani New Movie Dasara Movie Motion Poster
Nani29 - Dasara Movie: న్యాచురల్ స్టార్ నాని మరో పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ తో తన కెరీర్ 29వ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా తన 29వ చిత్రానికి "దసరా" టైటిల్ ఖరారు చేసినట్టుగా నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తెలంగాణా యాసతో బతుకమ్మ పాటతో "జమ్మి వెట్టి జెప్తున్నా బద్దల్ బాసింగాలతై, సూస్ కుందాం" అంటూ చెప్పే డైలాగ్ తో "దసరా" సినిమా టైటిల్ తో మోషన్ పోస్టర్ ని దసరా కానుకగా అభిమానులతో పంచుకున్నాడు.
ఈ చిత్రంలో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుండగా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వం వహించనున్నాడు. సంగీత దర్శకుడిగా సంతోష్ పని చేయనున్నట్లు మోషన్ పోస్టర్ లో తెలిపారు. ఈ సినిమా తెలంగాణాకి సంబందించిన ఒక యువకుడిగా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీతో నాని తన 29వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.