మనవడి కోసం ఒట్టు తీసి గట్టున పెట్టిన ఎన్టీఆర్ పెద్ద కుమారుడు.. అసలేం జరిగిందంటే..?

నందమూరి మోహన కృష్ణ (Nandamuri Mohan Krishna), లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు.

Update: 2025-05-13 11:25 GMT

మనవడి కోసం ఒట్టు తీసి గట్టున పెట్టిన ఎన్టీఆర్ పెద్ద కుమారుడు.. అసలేం జరిగిందంటే..?

నందమూరి మోహన కృష్ణ (Nandamuri Mohan Krishna), లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు. తన కెరీర్‌లో కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్ (Cinematographer)గా పనిచేసిన మోహన కృష్ణ, 2000లో చివరిసారి బాలకృష్ణ (Balakrishna)తో ఓ చిత్రం పూర్తి చేసిన తర్వాత, ఇకపై కెమెరా ముట్టుకోనని ఒట్టు వేసుకున్నారు.

అయితే, తాజాగా జరిగిన నందమూరి జానకిరామ్ కుమారుడు సినిమా లాంచ్ కార్యక్రమంలో ఈ ఒట్టు విరిగింది. మనవడి తొలి సినిమాకి ఫస్ట్ షాట్ గౌరవ సినిమాటోగ్రాఫర్ (First Shot Honorary Cinematographer)గా మోహన కృష్ణ బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత కెమెరా పట్టిన ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మనవడి కోసం పాతికేళ్లుగా తాను వేసుకున్న ఒట్టు త్యాగం చేసి, మళ్లీ కెమెరా ముందు రావడం నందమూరి ఫ్యాన్స్ (Nandamuri Fans) మధ్య హర్షాతిరేకాన్ని తెచ్చింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ (Viral on Social Media) అవుతున్నాయి.

Tags:    

Similar News