Kalyan Ram: అందరూ హుందాగా నడుచుకోవాలి.. అసెంబ్లీ ఘటనపై కళ్యాణ్ రామ్..
Kalyan Ram: అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిదన్నారు సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్.
Kalyan Ram: అందరూ హుందాగా నడుచుకోవాలి.. అసెంబ్లీ ఘటనపై కళ్యాణ్ రామ్..
Kalyan Ram: అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారం కోసం పాటు పడే దేవాలయం వంటిదన్నారు సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి వ్యక్తిగతంగా అసెంబ్లీలో మాట్లాడం ఎంతో బాధాకరమంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో అకారణంగా దూషించే పరిస్థితి ఎదురు కావడం దురదృష్టకరం అన్నారు.
అందరూ హుందగా నడచుకోవాలంటూ సూచించారు. "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.. యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రఫలా: క్రియా:" అంటూ ట్విట్ చేశారు. పూజ్యులు నందమూరీ ఎన్టీ రామారావు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం అంటూ కళ్యాణ్ రామ్ ట్విట్‌లో పేర్కొ్న్నారు.