బీచ్‌లో బాలయ్య సందడి.. సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్న..

Nandamuri Balakrishna: సంక్రాంతి పండుగను సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

Update: 2022-01-16 07:58 GMT

బీచ్‌లో బాలయ్య సందడి.. సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తున్న..

Nandamuri Balakrishna: సంక్రాంతి పండుగను సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బాలకృష్ణ భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో కలసి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలను కారంచేడులోని తన సోదరి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం భోగి వేడుకల్లో సందడి చేసిన నందమూరి బాలయ్య శనివారం సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు.

తాజగా బాలయ్య తన భార్య వసుంధరతో కలిసి చీరాల బీచ్‌లో సందడి చేశారు. టాప్ లెస్ ఫోర్డ్ జీప్‌లో తన భార్య వసుంధరను పక్కన కూర్చోపెట్టుకొని స్వయానా బాలకృష్ణ బీచ్ వద్ద జీపు నడిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో బీచ్‌లో కొద్దిసేపు గడిపారు. శనివార బాలయ్య గుర్రంపై స్వారీ అందరినీ ఆకట్టుకుంది. గుర్రంతో బాలయ్య డ్యాన్స్‌ వేయించిన తీరు హైలెట్‌గా నిలిచింది. ఓ పాటను పాడుతూ, డ్రమ్స్‌ వాయిస్తుండగా ఆ గుర్రం లయబద్ధంగా స్టెప్పులు వేసింది. మొత్తంగా దగ్గుబాటి వారి ఇల్లు నందమూరి కుటుంబ సభ్యుల రాకతో సంక్రాతి వేళ సందడిగా మారిపోయింది.

Full View


Tags:    

Similar News