దసరాకు అభిమానులకు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్

Update: 2020-10-20 05:11 GMT

దసరా రోజు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన కీలక పాత్రల్లో నటించి.. స్వీయ దర్శకత్వంలో మొదలైన చిత్రం నర్తనశాల. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన షూటింగ్‌ కొద్దిరోజులకే ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన 17నిమిషాల వీడియోను అభిమానుల కోసం విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. విజయదశమి కానుకగా ఎన్బీకే థియేటర్‌లో శ్రేయాస్ ఈటీ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంతభాగం స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ట్విట్టర్ వేదికగా బాలకృష్ణ తెలిపారు.

Full View

 

Tags:    

Similar News