Nagarjuna: వేవ్స్ సదస్సులో నాగార్జున..పుష్ప, బాహుబలి సినిమాల గురించి ఇలా అనేశారేంటీ?

Update: 2025-05-03 02:15 GMT

 Nagarjuna: వేవ్స్ సదస్సులో నాగార్జున..పుష్ప, బాహుబలి సినిమాల గురించి ఇలా అనేశారేంటీ?

Nagarjuna: టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పాన్ ఇండియా సినిమాల విజయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముంబైలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ లో నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక తెలంగాణ స్టాల్ ను నాగార్జున ప్రారంభించారు. తర్వాత కార్తి, ఖుష్బూ, అనుపమ్ ఖేర్ లతో కలిసి పాన్ ఇండియా సినిమా అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో నాగార్జున తన విశ్లేషణను అందించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. పుష్ప సిరీస్ సినిమాలు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇతర భాషల్లోనూ ఎక్కువ వసూళ్లను రాబట్టాయ్యాన్నారు. నేటి తరం ప్రేక్షకులు హీరోలను పుష్పరాజ్, కేజీఎఫ్, బాహుబలి వంటి అసాధారణమైన, శక్తివంతమైన పాత్రల్లో చూసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని..తాను కూడా అలాంటి పాత్రలనే ఇష్టపడుతానని చెప్పారు. కేవలం హీరోల ఎలివేషన్ మాత్రమే కాదు..బలమైన కథనం, కథ ఉండటం వల్ల ఈ చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయని ఆయన స్పష్టం చేశారు.

రాజమౌళి బాహుబలి చిత్రాన్ని తెలుగులో నిర్మించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు దాన్ని ఆదరించారని నాగార్జున పేర్కొన్నారు. ఒత్తిడి తగ్గించుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ ను ఆస్వాదించడానికి చాలా మంది సినిమాలను ఆశ్రయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వేడుకకు అమీర్ ఖాన్, కరీనా కపూర్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. గురువారం మొదలైన ఈ సదస్సు ఆదివారం వరకు కొనసాగుతుంది. 

Tags:    

Similar News