Naga Shaurya: ఫ్యామిలీ మ్యాన్ నిర్మాతల తో చేతులు కలపనున్న నాగశౌర్య

Naga Shaurya: యువ హీరో నాగ శౌర్య ఈమధ్యనే "వరుడు కావలెను", మరియు "లక్ష్య" అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Update: 2021-12-23 06:33 GMT

ఫ్యామిలీ మ్యాన్ నిర్మాతల తో చేతులు కలపనున్న నాగశౌర్య(ఫైల్-ఫోటో) 

Naga Shaurya: యువ హీరో నాగ శౌర్య ఈమధ్యనే "వరుడు కావలెను", మరియు "లక్ష్య" అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే రెండు సినిమాలు అనుకున్న విధంగా విజయాన్ని సాధించలేకపోయాయి. తాజాగా తన ఆశలన్నీ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" సినిమాపైనే పెట్టుకున్నాడు.

నాగశౌర్య ఈ సినిమా మాత్రమే కాక "పోలీసువారి హెచ్చరిక", మరికొన్ని సినిమాలు సైన్ చేశాడు నాగ శౌర్య. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరొక సినిమాకి సైన్ చేశారు శౌర్య. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను నిర్మిస్తోంది రాజ్ నిడిమోరు మరియు డీకే కృష్ణ. "డి ఫర్ దోపిడీ" మరియు "సినిమా బండి" సినిమా లన్ని నిర్మించిన వీరు హిందీలో "ది ఫ్యామిలీ మాన్" అనే సిరీస్ ని కూడా నిర్మించారు.

తాజాగా ఇప్పుడు వారు నాగశౌర్య తో ఒక మీడియం బడ్జెట్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఒక సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. "సినిమా బండి" ఫేం ప్రవీణ్ కండ్రేకుల ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Tags:    

Similar News