'అశ్వథామ' మూడు రోజుల కలెక్షన్స్
నూతన దర్శకుడు రమణ తేజ అశ్వథామ చిత్రాన్ని సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.
నూతన దర్శకుడు రమణ తేజ అశ్వథామ చిత్రాన్ని సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్యూటీ మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా శ్రీచరణ్ పాకాల సాంగ్స్ అందించారు. అశ్వథామ చిత్రం కొరకు హీరో నాగ శౌర్య స్వయంగా కథ అందిచడం విశేషం. నేడు నాగ శౌర్య రాయలసీమలోని కర్నూల్, కడప, అనంతపూర్, తిరుపతిలోని నాలుగు థియేటర్స్ సందర్శించబోతున్నాడు. అశ్వథామ మూవీ స్టాంగ్ కలెక్షన్స్ తో
దూసుకుపోతుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం హిట్ వైపుగా దూసుకుపోతుంది. మొదటి రెండు రోజులకు 7.05 కోట్ల వసూళ్లు సాధించి ఈ చిత్రం, ఆదివారం మరింత జోరు కనబరిచింది. వీకెండ్ పూర్తి అయ్యేనాటికి అశ్వథామ 10.35 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది.అంటే ఒక్క ఆదివారమే ఈ చిత్రం దాదాపు3.3 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో అశ్వథామ విశేష ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో థియేటర్స్ సంఖ్యను పెంచినట్టు వార్తలు వస్తున్నాయి.