Naga Shaurya: 7 భిన్నమైన షేడ్స్ లో కనిపించనున్న నాగశౌర్య

* ఆ సినిమాలో అన్నీ షేడ్లు చూపించబోతున్న నాగ శౌర్య

Update: 2021-10-30 12:00 GMT

నాగశౌర్య (ట్విట్టర్ ఫోటో)

Naga Shaurya: యువ హీరో నాగశౌర్య ఈ మధ్యనే "వరుడు కావలెను" అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. "అశ్వత్థామ" వంటి యాక్షన్ థ్రిల్లర్ తర్వాత నాగశౌర్య ఈసారి "వరుడు కావలెను" అంటూ ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చారు. రీతు వర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా పక్కనపెడితే నాగశౌర్య చేతుల్లో ఇప్పటికే మరొక మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. నటుడు మరియు దర్శకుడు అయిన అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో తన పాత్ర మిగతా సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉండబోతుందట. ఈ సినిమాలో నాగ శౌర్య పాత్రకి ఏడు భిన్నమైన షెడ్లు ఉంటాయని సమాచారం. ఇప్పటి దాకా అన్ని షేడ్స్ ఉన్న పాత్ర చేయలేదు. అందుకే ఇదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అంటున్నారు నాగ శౌర్య. అయితే ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నాగశౌర్య ఇక ఈ సినిమా కాకుండా "లక్ష్య" సినిమా తో కూడా బిజీగా ఉన్నారు. మరొక కాప్ డ్రామా లో నటించేందుకు నాగశౌర్య సైన్ చేశారు.

Tags:    

Similar News