Naga Chaitanya: మొదటిసారిగా అలాంటి పాత్రలో కనిపించనున్న నాగచైతన్య

"దూత" కోసం మొట్టమొదటిసారిగా అలాంటి పాత్రలో నాగచైతన్య

Update: 2022-12-08 15:00 GMT

Naga Chaitanya: మొదటిసారిగా అలాంటి పాత్రలో కనిపించనున్న నాగచైతన్య

Naga Chaitanya: ఎంతసేపు ఒకే రకమైన పాత్రలు మరియు జోనర్లు కాకుండా విభిన్న పాత్రలు రకరకాల జోనర్లు ట్రై చేస్తూ ఉంటేనే అభిమానులు కూడా అంతే ఆసక్తిగా థియేటర్లకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభూ దర్శకత్వంలో "కస్టడీ" అనే తెలుగు, తమిళ్ సినిమా చేస్తున్న నాగచైతన్య మరోవైపు "దూత" అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలలో కూడా అడుగుపెట్టబోతున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కాబోతోంది.

ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారట. కెరీర్ లో సక్సెస్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే ఒక యువకుడి పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు. ఇలాంటి పాత్రలో నాగచైతన్య ఇంతకుముందు ఎప్పుడూ కనిపించలేదు. దీంతో ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో నాగచైతన్య విభిన్న లుక్ తో కూడా కనిపించబోతున్నాడట.

నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై శరత్ మారార్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ లో మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్లు ఉండగా ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాల పాటు ఉంటుంది. ఫారిన్ టెక్నీషియన్ మీకోలాజ్ ఈ వెబ్ సిరీస్ కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా ఇషాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ నులి ఎడిటింగ్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ వెబ్ సిరీస్ కి రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. తరుణ్ భాస్కర్, పార్వతీ తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయి తదితరులు ఈ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News