Naga Chaitanya: ఆ పాట శోభితకు అంకితం.. నాగ చైతన్య

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం తండేల్. ఈ మూవీలో చైతూ సరసన హీరోయిన్‌గా సాయిపల్లవి నటించారు. వీరిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా. గతంలో వచ్చిన లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.

Update: 2025-02-03 10:20 GMT

ఆ పాట శోభితకు అంకితం.. నాగ చైతన్య

Naga Chaitanya: నాగచైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం తండేల్. ఈ మూవీలో చైతూ సరసన హీరోయిన్‌గా సాయిపల్లవి నటించారు. వీరిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా. గతంలో వచ్చిన లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది. దీంతో ఇప్పుడు తండేల్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆదివారం తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌‌లో బుజ్జితల్లి పాట గురించి నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బుజ్జితల్లి సాంగ్ విడుదలయ్యాక శోభిత ఫీలైందని నాగచైతన్య చెప్పారు.శోభితను బుజ్జితల్లి అని పిలుస్తుంటానని.. అందుకే ఆ పేరుతో సాంగ్ రావడం వల్ల ఆమె ఫీలయిందని నవ్వులు పూయించారు. ఈ పాటను శోభితకు అంకితమిస్తున్నానన్నారు. పాత్ర పేరు వరకు ఓకే. పాట కూడా పెట్టేశారా..? అంటూ శోభిత తనను అడిగారని డైరెక్టర్ చందూ మొండేటి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఇక తండేల్ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్స్యకారుల జీవితం ఆధారంగా చందూ మొండేటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చైతూ మత్స్యకారుడిగా కనిపించనున్నారు. ఇందులో దేశభక్తితో పాటు ప్రేమ కథను చెప్పబోతున్నారు. అయితే ఎవరి జీవితం ఆధారంగా సినిమాని తెరకెక్కించారో వారిలో కొందరు ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్‌లో సుమ సందడి చేశారు. నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Tags:    

Similar News