Custody: కస్టడీ ట్రైలర్ రిలీజ్.. శివ సెంటిమెంట్ చైతుకి కలిసివచ్చేనా..?
Custody: ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ , టీజర్ ఆకట్టుకోగా తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రామిసింగ్ లుక్ తో ఉండడం విశేషం.
Custody: కస్టడీ ట్రైలర్ రిలీజ్.. శివ సెంటిమెంట్ చైతుకి కలిసివచ్చేనా..?
Custody: అక్కినేని నాగచైతన్య, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ , టీజర్ ఆకట్టుకోగా తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రామిసింగ్ లుక్ తో ఉండడం విశేషం. ట్రైలర్ చూస్తుంటే కస్టడీ నుంచి పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు కానిస్టేబుల్ అయిన నాగచైతన్య ఏం చేశాడు అనే కథాంశంతో కస్టడీ చిత్రం ఉండనుందని తెలుస్తోంది.
సాధారణంగా పోలీసులు క్రిమినల్స్ ను ఏరి పారేయాలనుకుంటారు. కానీ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అందుకు భిన్నంగా నిందితుడిని చట్టం ముందు ప్రవేశపెట్టాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ఇది మన వెండితెరకు కొత్త పాయింట్ అనే చెప్పాలి. న్యాయం పక్కన నిలబడి చూడు...నీ లైఫ్ మారిపోతుంది. నిజం గెలవడానికి లేట్ అవుతుంది. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ చైతన్య పలికిన డైలాగులు ట్రైలర్ కే హైలైట్ గా ఉన్నాయి.
ఇళయరాజా నేపధ్యసంగీతం కూడా హైలైట్ గా ఉంది. సినిమాలో అక్కినేని నాగచైతన్య పేరు శివ. ఈ పేరుతో వచ్చిన అక్కినేని నాగార్జున మూవీ తిరుగులేని విజయం అందుకోవడమే కాదు పాత్ బ్రేకర్ మూవీగా నిలిచింది. శివ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజా ఇప్పుడు నాగార్జున తనయుడు నాగచైతన్య సినిమాకు సంగీతం అందించారు. ఈ సెంటిమెంట్లు అన్నీ వర్కౌట్ అయ్యి నాగచైతన్య హిట్టు కొట్టి డీలాగా ఉన్న అక్కినేని అభిమానుల్లో హుషారు నింపుతాడేమో చూడాలి.