Nabha Natesh: ఎన్టీఆర్ మూవీలో నభనటేష్
Nabha Natesh: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రానున్న కొత్త సినిమాలో నభనటేష్ నటించనుంది.
Nabha Natesh:(File Image)
Nabha Natesh: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రానున్న కొత్త సినిమాలో నభనటేష్ నటించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ టాక్. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. యంగ్ హీరో సుదీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభనటేష్. అందంతోపాటు నటనతో ఆకట్టుకున్న నభనటేష్ ఆతర్వాత రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.
ఇప్పుడు ఈ వయ్యారి యంగ్ హీరో నితిన్ తో జతకట్టనుంది. కుర్ర హీరో నితిన్ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ అంధాధున్ రీమేక్ మ్యాస్ట్రో సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో ఓ భారీ ఆఫర్ ను అందుకుందని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఆ కలయికలో ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల ట్వీట్ చేశారు. జూన్ రెండో వారం నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.