Movie: 14 ఏళ్లు షూటింగ్ జరుపుకున్న మూవీ.. టికెట్ల కోసం 5 కి.మీల లైన్‌లో నిల్చున్న ప్రేక్షకులు
ఇండియన్ సినిమాల్లో లెజెండరీ స్థానం సంపాదించిన ‘మొఘల్-ఏ-ఆజం’ చిత్రం నిర్మాణం 1944లో ప్రారంభమైంది.
Movie: 14 ఏళ్లు షూటింగ్ జరుపుకున్న మూవీ.. టికెట్ల కోసం 5 కి.మీల లైన్‌లో నిల్చున్న ప్రేక్షకులు
ఇండియన్ సినిమాల్లో లెజెండరీ స్థానం సంపాదించిన ‘మొఘల్-ఏ-ఆజం’ చిత్రం నిర్మాణం 1944లో ప్రారంభమైంది. దర్శకుడు కె. అసీఫ్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత గ్రాండ్‌గా రూపొందించాలని ప్లాన్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికావడానికి దాదాపు 14 ఏళ్లు పట్టింది. ప్రతి సీన్ పర్‌ఫెక్ట్‌గా ఉండాలన్న లక్ష్యంతో ఓసారి జ్యూయలరీలోని చిన్న ముత్యం కనిపించకపోవడంతో కూడా షూటింగ్ ఆపిన సందర్భం ఉంది.
ఈ చిత్రానికి ఆ కాలంలోనే రూ.1.5 కోట్లు ఖర్చయింది. నేటి విలువలో ఇది సుమారు రూ.300 కోట్లకు సమానం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో సలీం పాత్ర కోసం తొలుత దిలీప్ కుమార్ నిరాకరించినా, అసీఫ్ పట్టుదలతో అంగీకరించారు. ఈ సినిమా మొదట ‘చాంద్‌నీ బేగం’ అనే టైటిల్‌తో ప్రారంభమైంది కానీ తర్వాత ‘మొఘల్-ఏ-ఆజం’గా మార్చారు.
ఈ సినిమాకు సంబంధించి ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ అనే పాటకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ ఒక్క పాటపై అప్పట్లోనే రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. నేటి లెక్కల ప్రకారం ఇది రూ.50-100 కోట్ల స్థాయిలో ఖర్చు అవుతుందని అంచనా. నౌషాద్ స్వరపరిచిన ఈ పాటకు లతా మంగేష్కర్ వాయిస్ ప్లస్ అయ్యింది.
ఈ పాట కోసం నిర్మించిన ‘షీష్ మహల్’ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేగాక, ‘మోహే పంగత్ పే’, ‘తేరీ మెహఫిల్ మే’ వంటి పాటలు కూడా సంగీతాభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ మ్యూజిక్ ఈ సినిమాను శాశ్వతంగా ప్రేక్షక హృదయాల్లో నిలిపింది.
1960 ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా విడుదలైన రోజుల్లో టికెట్ల కోసం అభిమానులు థియేటర్ల ముందు రెండు రోజుల ముందు నుంచే క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. కొందరు టికెట్ కొట్టేందుకు రాత్రంతా రోడ్లపై పడుకుని క్యూలో నిలబడ్డారు. కొన్ని థియేటర్ల వద్ద 5 కిలోమీటర్ల వరకూ క్యూలు కనిపించాయి.
ఈ చిత్రం 150 థియేటర్లలో విడుదలై, అప్పట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్‌తో, 15 ఏళ్లపాటు బాలీవుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతేకాకుండా, ఈ సినిమా రష్యా, చైనా లాంటి దేశాల్లోనూ విడుదలై అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది.
సినిమా కథ ఏంటంటే:
‘మొఘల్-ఏ-ఆజం’ అనేది అనార్కలీ అనే నాటకాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా. ఇందులో దిలీప్ కుమార్ సలీంగా, మధుబాల అనార్కలీగా, పృథ్వీరాజ్ కపూర్ అక్బర్‌గా అద్భుత నటనతో ప్రేక్షకులను మైమరిపించారు. మధుబాల అందం, దిలీప్ ఎమోషన్, అసీఫ్ విజన్ కలిసి ఈ చిత్రాన్ని ఒక కల్ట్ క్లాసిక్గా మార్చాయి.
2004లో ఈ సినిమా కలర్ వెర్షన్‌గా మళ్లీ విడుదలై న్యూ జనరేషన్ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకుంది. ఈ చిత్రం నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌తో పాటు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా గెలుచుకుంది.