CBN and YSR : చంద్రబాబు, వైఎస్సార్ ల స్నేహం బంధంపై సినిమా?

CBN and YSR : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత మంచి మిత్రులే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2020-08-11 08:40 GMT
CBN and YSR

CBN and YSR : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంత మంచి మిత్రులే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరు మంచి స్నేహితులే అయినప్పటికీ రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రత్యర్థులుగా మారాల్సి వచ్చింది.. అయితే వీరి స్నేహ బంధం పై ఇప్పుడు ఓ సినిమా తెరకెక్కన్నున్నట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 1980 నుండి 2000 సంవ‌త్సరాల మ‌ధ్య చంద్రబాబు, వై.ఎస్‌.ఆర్ ల మధ్య ప్రయాణం ఎలా సాగింది అనే అంశాల పైన ఈ సినిమా సాగనుంది అని తెలుస్తోంది..

ఈ సినిమాను విష్ణు ఇందూరి, తిరుమ‌ల రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తార‌ని, వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ దీనికి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా ఉండనుందని సమాచారం. మొదటి భాగంలో చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో మొదలవ్వగా, రెండవ భాగం వైయస్ఆర్ మరణంతో ముగుస్తుందని టాక్ .. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది..

ఇక ఒకే పార్టీ నుంచి వైఎస్సార్, చంద్రబాబుల రాజకీయ జీవితం మొదలైందన్న సంగతి తెలిసిందే.. ఆ తర్వాత చంద్రబాబు తన మామ అయిన నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీలోకి వెళ్ళిపోయారు.. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1994 నుండి 2004 వరకు పనిచేశారు. ఇక ఆ తర్వాత వైఎస్సార్ 2004 నుంచి 2009 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.. వైఎస్సార్ 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోయారు.  

Tags:    

Similar News