Mohanlal: ద‌టీజ్ మోహ‌న్ లాల్‌.. ఇప్ప‌టికీ త‌గ్గ‌ని క్రేజ్

Mohanlal: కేవలం కేరళ మార్కెట్‌లోనే రూ. 100 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన తొలి మలయాళ చిత్రంగా ‘తుడరుమ్’ చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేస్తూ, ‘‘కేరళ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయం’’ అంటూ మోహన్‌లాల్ సోషల్ మీడియాలో స్పందించారు.

Update: 2025-05-14 14:52 GMT

Mohanlal: ద‌టీజ్ మోహ‌న్ లాల్‌.. ఇప్ప‌టికీ త‌గ్గ‌ని క్రేజ్

Mohanlal: కేవలం కేరళ మార్కెట్‌లోనే రూ. 100 కోట్ల గ్రాస్‌ వసూలు చేసిన తొలి మలయాళ చిత్రంగా ‘తుడరుమ్’ చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేస్తూ, ‘‘కేరళ బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయం’’ అంటూ మోహన్‌లాల్ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలుపుతూ ‘‘ఈ మైలురాయిని మనం కలిసి సాధించాం’’ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 210 కోట్లకు పైగా రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలో మూడో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. కథలో ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్‌ అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం, తనను తాను రక్షించుకోవడానికి ఏం చేశాడ‌న్న అంశాల ఆధారంగా దర్శకుడు తరుణ్ మూర్తి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మోహన్‌లాల్‌కి జోడీగా శోభన నటించారు. సినిమా ఏప్రిల్ 25న విడుదలైంది.

మరోవైపు ప్రిత్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎల్ 2: ఎంపురాన్’ సినిమా ఇప్పటివరకు రూ. 268 కోట్లు వసూలు చేసి మలయాళ సినిమా చరిత్రలో నంబర్ 1 స్థానం సంపాదించింది. లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా మార్చి 27న విడుదలై, కేవలం ఐదు రోజుల్లోనే రూ.200 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మలయాళ మూవీగా రికార్డు సొంతం చేసుకుంది.

ఒకే నెలలో మోహన్‌లాల్ నటించిన రెండు సినిమాలు విడుదలై టాప్ 1, టాప్ 3 స్థానాల్లో నిలవడం అభిమానుల్లో ఆనందం నింపింది. ‘‘దటీజ్ మోహన్‌లాల్‌’’ అంటూ సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News