Mohanlal's Health Condition: మోహన్ లాల్‌కి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
Mohanlal's Health Condition: మళయాళం స్టార్ హీరో మోహన్ లాల్‌కి అస్వస్థత. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు. తీవ్ర ఆందోళనకు గురైన మోహన్ లాల్ అభిమానులు.
Mohanlal Health Condition
Mohanlal's Health Condition Latest Updates: ప్రముఖ మళయాళం స్టార్ హీరో మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మోహన్ లాల్‌ని పరీక్షించిన వైద్యులు.. ఆయన తీవ్ర జ్వరం, కండరాల నొప్పులతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్టు గుర్తించారు. అధికారిక మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. మోహన్ లాల్ వైరల్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ బారిన పడినట్టు డాక్టర్లు అనుమానిస్తున్నారు.
వైరల్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ సోకిన వారికి శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు మోహన్ లాల్ కూడా అలాంటి సమస్యతోనే బాధపడుతున్నారు. ఆయన మరో 5 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇటీవలే గుజరాత్‌లో ' L2:ఇంపురాన్ ' అనే సినిమా షూటింగ్ ముగించుకుని కొచ్చికి వచ్చిన తరువాతే మోహన్ లాల్ అనారోగ్యం బారినపడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
మోహన్ లాల్ తొలిసారిగా డైరెక్షన్ విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. బారోజ్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరో తొలిసారిగా డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో బారోజ్ మూవీపై మోహన్ లాల్ అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. వాస్తవానికి బారోజ్ సినిమా ఈ ఏడాది మార్చి 28నే విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్‌లో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.