Kannappa: విజయవాడలో ‘కన్నప్ప’ స్పెషల్ షో... సాధువులతో కలిసి వీక్షించిన మోహన్ బాబు

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా మంచి ఆదరణ పొందుతోంది. జూన్ 27న విడుదలైన ఈ డివోషనల్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Update: 2025-07-08 15:27 GMT

Kannappa: విజయవాడలో ‘కన్నప్ప’ స్పెషల్ షో... సాధువులతో కలిసి వీక్షించిన మోహన్ బాబు

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమా మంచి ఆదరణ పొందుతోంది. జూన్ 27న విడుదలైన ఈ డివోషనల్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక ప్రదర్శన మంగళవారం విజయవాడలో నిర్వహించబడింది. ప్రముఖ గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ షోను ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శనకు సినీ దిగ్గజం మోహన్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నాగ సాధువులు, అఘోరాలు, యోగినులు కూడా ఈ చిత్రాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, ‘‘కన్నప్ప సినిమా ఎక్కడ చూసినా మంచి స్పందన వస్తోంది. నా కుమారుడు విష్ణు నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రోజు విజయవాడలో గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నాగ సాధువులు, యోగినులతో కలిసి సినిమా చూడడం ఒక ప్రత్యేక అనుభూతి’’ అని అన్నారు.

గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘‘కన్నప్ప కథను పునర్నిర్మించడం గొప్ప కార్యక్రమం. విష్ణు నటనలో జీవించిపోయారు. మోహన్ బాబు గారి ప్రొడక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా ఆధ్యాత్మికతతో పాటు భక్తిరసాన్ని అందిస్తోంది. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి నటులు అందరూ తమ పాత్రలతో చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాగ సాధువులు, మాతాజీలు కూడా ఎంతో ఆసక్తిగా సినిమా చూశారు’’ అని అన్నారు.

ఈ సందర్భంగా సాధువులు కూడా సినిమా పట్ల తమ ప్రశంసలను వ్యక్తం చేశారు. మొత్తం మీద, 'కన్నప్ప' మూవీ విజయవంతమైన డివోషనల్ చిత్రంగా ముందుకు సాగుతుండటం మోహన్ బాబు కుటుంబానికి గర్వకారణంగా మారింది.

Tags:    

Similar News