Mohan Babu Gift to Chiranjeevi : మెగాస్టార్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన మోహన్ బాబు!
Mohan Babu Gift to Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నిన్న(ఆగస్టు 22) 65 వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ
Mohan babu sent Birthday gift to megastar chiranjeevi
Mohan Babu Gift to Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నిన్న(ఆగస్టు 22) 65 వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. అటు మెగా అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక చిరంజీవి తమ్ముడు నాగబాబు, అల్లు అరవింద్ , కొందరు మెగా ఫ్యాన్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో కేక్ కట్ చేశారు. ఇక ఈ సారి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు వినాయక చవితి రోజున రావడంతో చిరంజీవి రెండింటిని తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు..
ఒక ఇది ఇలా ఉంటే చిరంజీవికి హీరో మోహన్ బాబు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆకృతిలో ఉన్న బైక్ కళాకృతి దగ్గర నిలుచుని ఫొటో కూడా దిగారు చిరు.. దీనికి సంబంధించిన ఫోటోను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. "నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజు నాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. నీ బహుమానానికి ధన్యవాదాలు" అంటూ వెల్లడించారు. మోహన్ బాబు ఇచ్చిన గిఫ్ట్ పట్ల ఎంతో సంతోషించానని చిరు వెల్లడించారు.
ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.. "చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్" అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.
నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి... ... ... Thank you @themohanbabu 🤗 pic.twitter.com/8ROLZ6yfwI
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2020