Mirai box office Day 3: బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న తేజ సజ్జా.. ఆ స్టార్ హీరోల రికార్డును బద్దలు కొట్టాడా?

Mirai box office Day 3: యంగ్ హీరో తేజ సజ్జా బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాడు.

Update: 2025-09-15 09:41 GMT

Mirai box office Day 3: యంగ్ హీరో తేజ సజ్జా బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటాడు. 'హనుమాన్' సినిమాతో వచ్చిన విజయాన్ని కొనసాగిస్తూ, తాజాగా విడుదలైన 'మిరాయ్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 27.20 కోట్లు వసూలు చేసిన 'మిరాయ్', రెండో రోజు మరింత పుంజుకొని రూ. 55.66 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఇక మూడో రోజుతో కలిపి తొలి వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ. 81.2 కోట్ల గ్రాస్ వసూళ్లతో భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లోనూ 2 మిలియన్ మార్క్‌కు చేరువలో ఉంది.

హిందీలో సరికొత్త రికార్డు:

పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు తేజ సజ్జా కూడా చేరాడని చెప్పాలి. 'హనుమాన్' సినిమాతో హిందీ మార్కెట్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న తేజ, 'మిరాయ్'తో దాన్ని మరింత పెంచుకున్నాడు. మూడు రోజుల్లోనే హిందీ బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్లు వసూలు చేసి, తెలుగు నుంచి ఈ స్థాయిలో విజయం సాధించిన యువ హీరోగా తేజ సజ్జా నిలిచాడు. ఇది అతని కెరీర్‌లోనే ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో తేజ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Tags:    

Similar News