"బిల్లా" సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్న మెహర్ రమేష్
Meher Ramesh: ఈ మధ్యనే ఈ సినిమా రీ రిలీజ్ అయింది కానీ మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గానే నిలిచింది
"బిల్లా" సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్న మెహర్ రమేష్
Meher Ramesh: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు మెహర్ రమేష్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా "బిల్లా". 2009లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ను అందుకుని కలెక్షన్ల పరంగా కూడా కేవలం యావరేజ్ గానే నిలిచింది. అయితే ఈ మధ్యనే ఈ సినిమా రీ రిలీజ్ అయింది కానీ మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గానే నిలిచింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చేసారు సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్. ఈ సినిమా గురించి మాట్లాడుతూ అదే ఏడాది 2009లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాలు కిక్ మరియు మగధీర సినిమాలతో కంపేర్ చేస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు మెహర్ రమేష్.
"సినిమా చేసే ముందు ప్రభాస్ నాతో ఇలా అన్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అనవసరం కానీ సినిమా చాలా స్టైలిష్ గా ఉండాలి, అదిరిపోయేలా ఉండాలి అని అన్నారు. అప్పటికి నా చేతిలో వేరే మంచి స్క్రిప్ట్ ఉన్నప్పటికీ నేను ప్రభాస్ కోరిక మేరకు బిల్లా సినిమాని ప్రేక్షకుల కోసం స్టైలిష్ గా ఉండేలా తీశాను," అని చెప్పుకొచ్చారు మెహర్ రమేష్. అంతేకాకుండా మగధీర, కిక్ వంటి సినిమాలు కూడా అప్పటికి ప్రేక్షకులు చూడలేదని బిల్లా సినిమా తరువాతే అవి విడుదలయ్యాయని అన్నారు మెహర్ రమేష్. తాజాగా ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.