మెగాస్టార్ సైరా ఇలా రెడీ అయింది..

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా షూటింగ్ విశేషాలతో కూడిన మూవీ మేకింగ్ వీడియో ను ఈరోజు విడుదల చేశారు.

Update: 2019-08-14 14:27 GMT

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. పీరియాడికల్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని చిరంజీవి స్వయంగా చెప్పారు. అక్టోబర్ 2న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సైరా సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్రాఫిక్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది.

ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.కాగా, ఈ సినిమా మేకింగ్ వీడియోను ఈరోజు చిత్ర బృందం విడుదల చేసింది. చిత్రం షూటింగ్ విశేషాలను చక్కగా పొందుపరిచిన ఈ వీడియో అభిమానులను అలరిస్తోంది. అమితాబ్ గెటప్..జగపతి బాబు గెటప్ ఆసక్తి కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను కూడా ఓ షాట్ చూపించి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు చిత్రబృందం.


Tags:    

Similar News