నా సినిమాను రెండో రోజే ఎత్తేశారు.. సినిమా ఫిలాసఫీ మారలేదు అంటున్న మెగాస్టార్..

సినిమా ఫిలాసఫీ మారలేదు అంటున్న మెగాస్టార్

Update: 2022-09-01 10:34 GMT

నా సినిమాను రెండో రోజే ఎత్తేశారు.. సినిమా ఫిలాసఫీ మారలేదు అంటున్న మెగాస్టార్..

Chiranjeevi: కరోనా తర్వాత ఓటీటీలలో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు బాగా అలవాటు పడిపోయారని, థియేటర్ లకు రావడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని గత కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. "కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రావటం మానేశారని, ఓటీటీ లలోనే సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారని చాలామంది చెబుతున్నారు. కానీ అందులో నిజం లేదు. ఎప్పుడైనా సరే కంటెంట్ ఉంటే సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది.

ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది ఈ సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయగలుగుతుంది అని ప్రేక్షకులకు నమ్మకం కుదిరితే తప్పకుండా వాళ్ళు థియేటర్లకు వచ్చే సినిమా చూస్తారు. ఈ మధ్యనే విడుదలైన "బింబిసారా", "సీతారామం", "కార్తికేయ 2" సినిమాలు దీనికి ఉదాహరణలు" అని అన్నారు చిరంజీవి.

"ఈ సినిమాలు రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇలాంటి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. అంతే తప్ప సినిమా ఫిలాసఫీ మారిపోయింది, ప్రేక్షకులు థియేటర్లకు రావటం మానేశారు, ఫోన్లోనే సినిమాలు చూస్తున్నారు అనేదాంట్లో నిజం లేదు. వాళ్లకి నచ్చే కంటెంట్ మనం ఇవ్వగలగాలి. ఆ కంటెంట్ ఉంటే వాళ్ళు థియేటర్లకు వస్తారు. లేకపోతే సినిమా రెండో రోజే వెళ్ళిపోతుంది. ఈమధ్య నా సినిమా కూడా అలానే వెళ్లిపోయింది," అంటూ నవ్వేశారు మెగాస్టార్. చిరంజీవి నటించిన "ఆచార్య" సినిమా డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News