Chiranjeevi Birthday Celebrations : ఫ్యామిలీతో కలిసి చిరు పుట్టినరోజు వేడుకలు!
Chiranjeevi Birthday Celebrations : మెగాస్టార్ చిరంజీవి నిన్న(ఆగస్టు 22) 65 వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా
Megastar chiranjeevi birthday celebrations with his family members
Chiranjeevi Birthday Celebrations : మెగాస్టార్ చిరంజీవి నిన్న(ఆగస్టు 22) 65 వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయనకి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. అటు మెగా అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక చిరంజీవి తమ్ముడు నాగబాబు, అల్లు అరవింద్ , కొందరు మెగా ఫ్యాన్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో కేక్ కట్ చేశారు. ఇక ఈ సారి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు వినాయక చవితి రోజున రావడంతో చిరంజీవి రెండింటిని తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.. చిరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అటు చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ 65వ పుట్టినరోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటుగా మోషన్ పోస్టర్ ని నిన్న సాయింత్రం రిలీజ్ చేసింది చిత్రబృందం.. సరిగ్గా నిమిషం ఉన్న ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మోషన్ పోస్టర్ లో 'ధర్మస్థలి' అనే గ్రామాన్ని చూపించారు మేకర్స్.. చూస్తుంటే కథలో కీలమైన ఘట్టం ఈ గ్రామం చూట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఇందులో చిరు రెండు విభిన్నమైన పాత్రాల్లో నటించనున్నారు.
ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది.. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.