Fish Venkat: ఫిష్‌ వెంకట్‌ దీన స్థితిపై స్పందించిన చిరు.. కీలక నిర్ణయం

సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది వెంకట్‌కు ఆర్థిక సాయం అందించారు

Update: 2024-09-10 16:15 GMT

Fish Venkat: ఫిష్‌ వెంకట్‌ దీన స్థితిపై స్పందించిన చిరు.. కీలక నిర్ణయం

వెంకట్‌.. ఈ పేరు అందరికీ తెలియకపోయినప్పటికీ ఫిష్‌ వెంకట్‌ అనగానే ఠక్కును గుర్తుపడతారు. చాలా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు వెంకట్‌. విలన్‌ గ్యాంగ్‌లో ఉంటూనే తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు ఫిష్‌ వెంకట్‌. అయితే తాజాగా ఫిష్‌ వెంకట్‌ గత కొన్నిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్‌ వెంకట్ దీన స్థితిలో ఉన్నాడు.

ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటికే పరిమితం అయ్యాడు. డయాబెటిక్‌, బీపీ సమస్యల కారణంగా కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్‌కు గురైంది. రెండు కిడ్నీలు ఫెయిల్‌ కావడంతో ప్రస్తుతం వెంకట్‌ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రపంచానికి తెలిసింది. దీంతో వెంకట్‌ ఆరోగ్యంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు.

సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది వెంకట్‌కు ఆర్థిక సాయం అందించారు. ఇప్పటికే ఫిష్ వెంకట్ కాలుకు వైద్యం చేశారు డాక్టర్స్.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారికి ఎప్పుడూ అండగా నిలిచే మెగాస్టార్‌ చిరంజీవి ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అపోలో హాస్పటల్స్‌లో ఫిష్ వెంకట్‌కు ఉచితంగా వైద్యం చేయించేలా డాక్టర్స్‌తో చిరు మాట్లాడరని తెలుస్తోంది.

అపోలో ఆసుపత్రిలో చేరిన వెంకట్‌కు అయ్యే వైద్య ఖర్చును మొత్తం ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక వెంకట్‌ ఆరోగ్యం గురించి చిరు అపోలో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో సాయంలోనూ చిరు మెగా స్టార్‌ అంటూ అభిమానులు సంతోషపడుతున్నారు.

Tags:    

Similar News