Maya Sabha: ట్రెండింగ్లో దూసుకెళ్తున్న వెబ్ సిరీస్

రైజ్ ఆఫ్ టైటాన్స్’ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 11–17, 2025 వారానికి సంబంధించిన ఓర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన స్ట్రీమింగ్ షోల జాబితాలో మయసభ 3వ స్థానాన్ని దక్కించుకుంది.

Update: 2025-08-19 12:51 GMT

Maya Sabha: ట్రెండింగ్లో దూసుకెళ్తున్న వెబ్ సిరీస్

మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 11–17, 2025 వారానికి సంబంధించిన ఓర్మాక్స్ మీడియా సర్వే ప్రకారం, భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన స్ట్రీమింగ్ షోల జాబితాలో మయసభ 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు 2.8 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పాన్-ఇండియా స్థాయిలో ఈ సిరీస్ ట్రెండింగ్‌లో నిలిచింది. భాషా సరిహద్దులు దాటుతూ అన్ని ప్రాంతాల ప్రేక్షకులను సమానంగా ఆకట్టుకుంటోంది.

దేవా కట్టా, కిరణ్ జే కుమార్ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో ఆది పినిశెట్టి (కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో), చైతన్య రావు (ఎంఎస్ రామి రెడ్డి పాత్రలో) అద్భుతమైన నటన కనబరిచారు. ఇద్దరి మధ్య స్నేహం, వారి ప్రయాణం, రాజకీయ ఆటలతో కూడిన కథనాన్ని ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

హిట్‌మెన్ & ప్రూడోస్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై రూపొందిన ఈ సిరీస్‌లో దివ్య దత్తా, సాయికుమార్, నాజర్, శత్రు, రవీంద్ర విజయ్, తాన్య రవిచంద్రన్ వంటి ప్రతిభావంతమైన నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు.

మయసభ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అత్యంత చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News