Vijay Birthday Poster: హీరో విజయ్ 64 లుక్స్ అదుర్స్
Vijay Birthday Poster: విజయ్ పుట్టిన రోజు సందర్భంగా మాస్టర్ చిత్ర నిర్మాత లలిత్‌కుమార్ ఒక స్పెషల్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు.
Special Poster Ahead Vijay's Birthday: (File Image)
Vijay Birthday Poster: ఈ మధ్య కాలంలో హీరోల పుట్టినరోజులకు వారి హిట్ సినిమాల త్రీడీ ఇమేజెస్ ను కటౌట్ లా పెట్టి.. పోస్టర్లను రిలీజ్ చేయడం కామన్ అయిపోయింది. గత ఏడాది మెగాస్టార్ బర్త్ డేకి రామ్ చరణ్ అలాగే విడుదల చేశారు. ఆ తర్వాత రామ్ చరణ్, ప్రభాస్ ఇలా చాలామంది స్టార్ల బర్త్ డేలకు అలాంటి పోస్టర్లు రిలీజ్ చేయడం కామనైపోయింది. ఇప్పుడీ ట్రెండ్ ను కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు లేటెస్ట్ మూవీ మాస్టర్ నిర్మాత లలిత్ కుమార్. విజయ్ బర్త్ డే సందర్భంగా.. ఆయన నటించిన 64 చిత్రాల ఫోటోలను పెడుతూ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ నెల 22న పుట్టినరోజు జరుపుకోనున్నారు. విశేషం ఏమిటంటే ఆ పోస్టర్‌లో విజయ్ నటించిన (మొదటి చిత్రం నుంచి ఇప్పటి వరకు) 64 చిత్రాలకు సంబంధించిన విజయ్ ముఖ చిత్రాలను పొందుపరిచారు. ప్రస్తుతం విజయ్ 65వ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. వంశి పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా తెలుగులో తొలిసారిగా నటించడానికి సిద్ధమవుతున్నారు.