Manchu Manoj: నడవలేని స్థితిలో మంచు మనోజ్..ఆసుపత్రిలో చికిత్స..వీడియో వైరల్
Manchu Manoj: హీరో మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరారు. అతనికి కాలికి గాయంతో నడవలేని స్థితిలో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారు. అటు మంచు ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మనోజ్, మోహన్ బాబు ఇద్దరు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
మోహన్ బాబు అనుచరుడు వినయ్ మనోజ్ పై దాడి చేసినట్లు మనోజ్ ఆరోపించారు. అటు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు హాట్ టాపిగ్గా మారాయి. మోహన్ బాబుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. తండ్రి తనను కొట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. ఆస్తులు, స్కూలు వ్యవహారంలో పరస్పర దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మనోజ్ గాయాలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారని సమాచారం. తనతోపాటు తన భార్యపై కూడా దాడికి పాల్పడ్డారని మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారు.
మంచు ఫ్యామిలీలో వివాదాలు అంటున్న వస్తున్న వార్తలపై మోహన్ బాబు ఫ్యామిలీ స్పందించింది. అసత్య ప్రచారాలు చేయకూడదని విజ్నప్తి చేసింది. ఆదివారం సాయంత్రం మనోజ్ కాలి గాయంలో ఆసుపత్రిలో చేరడం ఇప్పుడు వస్తున్న ప్రచారాలకు మరింత ఊతం ఇస్తోంది. మోహన్ బాబు, మనోజ్ లు నిజంగా దాడికి పాల్పడినట్లు అర్థమవుతోంది. అయితే మోహన్ బాబు, మనోజ్, విష్ణు ల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మనోజ్ పెళ్లిలో విష్ణు కనిపించలేదు. అప్పట్లో మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మనోజ్ సంబంధీకులపై విష్ణు దాడి చేసిన వీడియో కూడా అప్పట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను స్వయంగా మనోజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశాడు. ఈ గొడవల వల్ల మంచు ఫ్యామిలీ రెండుగా విడిపోయినట్లు తెలుస్తోంది.