Manchu Laxmi: భర్తతో కలిసి ఉండడం లేదా.? క్లారిటీ ఇచ్చేసిన మంచు లక్ష్మీ..!
Manchu Laxmi: ఇటీవల మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తోంది. మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే.
Manchu Laxmi: భర్తతో కలిసి ఉండడం లేదా.? క్లారిటీ ఇచ్చేసిన మంచు లక్ష్మీ..!
Manchu Laxmi: ఇటీవల మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తోంది. మోహన్ బాబు, మంచు మనోజ్ వివాదం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ప్రతీ రోజూ వార్తల హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఇదిలా ఉంటే మంచు వారి అమ్మాయి లక్ష్మీ కూడా తాజాగా వార్తల్లోకెక్కారు. అమెరికాలో విద్యాభ్యాసం చేసి అక్కడ కొన్ని సినిమాల్లో నటించిన లక్ష్మీ ఆ తర్వాత ఇండియా వచ్చి ఇండస్ట్రీలో బిజీగా మారిన విషయం తెలిసిందే.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణించింది. ఇదిలా ఉంటే మంచు లక్ష్మీ గత కొన్ని రోజులుగా ముంబయిలో ఉంటోంది. అయితే లక్ష్మీ అక్కడ కేవలం కూతురుతో మాత్రమే ఉంటోందని. భర్తకు దూరంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. దీంతో మంచు లక్ష్మీ భర్త నుంచి విడాకులు తీసుకోనుందా.? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీంతో ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు లక్ష్మీ.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడుతూ.. తన భర్త ఆండీ శ్రీనివాస్ విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారని తెలిపింది. తాము ఎంతో అన్యోన్యంగా ఉంటామని, సోషల్ మీడియాలో వచ్చేవన్నీ అబద్ధాలేనని తేల్చి చెప్పేసింది. ఇక తామిద్దరం సమాజంలో ప్రశాంతంగా బతికేలా, స్వేచ్ఛను ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పుకొచ్చింది. న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో జీవిస్తామని తెలిపింది.
ఇక స్వేచ్ఛ, ప్రైవసీ, వ్యక్తిగత బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపిన మంచు లక్ష్మీ.. తమకు ఎలా అనిపిస్తే అలా బతుకుతున్నామని క్లారిటీ ఇచ్చింది. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ.. తమ ప్రశాంతతను కోల్పోమని తేల్చి చెప్పేసింది. ఇటీవలే రెండు నెలలు తన భర్తతో కలిసి ఉన్నానని, అలాగే తన కూతురు ఇప్పుడు భర్త దగ్గర ఉందని చెప్పుకొచ్చింది.