బాలయ్యతో చిందేయడానికి హీరోయిన్ రెడీ..
Prayaga Martin With Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం..
Nandamuri Balakrishna and Prayaga Martin
https://www.thehansindia.com/cinema/tollywood/mallu-beauty-for-balakrishna-boyapati-film-651621
Prayaga Martin With Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా మలయాళ బ్యూటి ప్రయాగ మార్టిన్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ని మొదలు పెట్టిన ప్రయాగ మార్టిన్ .. ఆ తరవాత హీరోయిన్ గా మారింది. మలయాళ, తమిళ్, కన్నడ చిత్రాలలో నటించింది. తమిళ్ లో వచ్చిన పిశాచి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామ బాలయ్య సరసన బాగుంటుందని బోయపాటి ఆమెకి కథని వినిపించగా,ఆమె కూడా ఒకే చెప్పినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ షెడ్యుల్ లో బాలయ్య, ప్రయాగ మార్టిన్ పైన సన్నివేశాలను బోయపాటి చిత్రికరించానున్నాడట.
ఇక ఇందులో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. త్వరలోనే మళ్ళీ షూటింగ్ మొదలుకానుంది. అటు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారని సమాచారం..ఇక ఈ సినిమాకి మోనార్క్ అనే టైటిల్ ని పరీశిలిస్తున్నట్టుగా సమాచారం.