Mahesh Babu New Movie: హృతిక్ రోషన్ స్థానంలో మహేష్ బాబు?
Mahesh Babu New Movie:"సర్కారు వారి పాట" సినిమా షూటింగ్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నారు.
మహేష్ బాబు, హృతిక్ రోషన్ (ఫొటో: ది హన్స్ ఇండియా)
Mahesh Babu New Movie: పరశురాం దర్శకత్వంలో వస్తోన్న "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నారు. త్వరలోనే బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నట్లున్నాడు టాలీవుడ్ ప్రిన్స్.
ఫిల్మ్ నగర్ నుంచి వస్తున్న వార్తల మేరకు.. మహేష్ బాబును బాలీవుడ్ చిత్రం కోసం నిర్మాతలు సంప్రదించినట్లు తెలుస్తోంది. "రామాయణ 3 డీ" నిర్మాత మధు మంతేన "మహర్షి" నటుడిని కలుసుకుని ఆ ప్రాజెక్ట్ గురించి చర్చించారంట. హై బడ్జెట్ పౌరాణిక సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ పాత్ర కోసం మొదట్లో హృతిక్ రోషన్‌ను అనుకున్నారట చిత్ర నిర్మాతలు. కానీ, ప్రస్తుతం మహేష్ బాబుతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని చూస్తున్నట్లు టాక్. ఇప్పటికైతే మహేష్ బాబు నుంచి ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్ట్‌వర్క్ పూర్తయింది. నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.