సూపర్‌స్టార్ మహేష్ సర్ప్రైజ్.. 'సర్కారు వారి పాట' లుక్ అదుర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాకు సర్కారి వారి పాటగా టైటిల్ 'సర్కారు వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సంరద్భంగా అధికారికంగా ఈరోజు ఉదయం 9 గంటల 9 నిముషాలకు చిత్రబృందం టైటిల్ ప్రకటించింది. టైటిల్ పోస్టర్‌ను మహేశ్ ఆదివారం ట్విటర్ వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మహేశ్ మాస్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవి పోగుతో మెడపై రూపాయి టాటూతో మహేశ్ సరికొత్తగా కనిపించారు.
ఇక ఎప్పటినుండో అనుకున్నట్లుగా మహేష్ కోసం పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధం చేశాడట. పరశురామ్ తన స్కిప్టులో ఇటు మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా సన్నివేశాలు రాసుకున్నాడట. మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌గా కనిపించడమే కాదు.. కాలేజ్ స్టూడెంట్‌గాను అదరగొట్టనున్నాడట. ఈ చిత్రంలో మొత్తం మహేష్ మూడు పాత్రల్లో నటించనున్నాడని టాక్. 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత రాజమౌళి-మహేశ్ కాంబినేషన్లో ఓ సినిమా రానుంది.
ఇక ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్స్ ఎవరనేది ప్రకటించలేదు. కియారా అద్వానీ నటించనుందని టాక్ నడిచింది. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు వినిపించింది. నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తుండడంతో ఈ సినిమా మంచి అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రాన్ని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలు కలిసి నిర్మిస్తున్నాయి.