Mahesh Babu: కృష్ణా నదిలో సూపర్ స్టార్ అస్థికలు నిమజ్జనం.. విజయవాడ చేరుకున్న మహేష్ బాబు..
Superstar Krishna: లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్టు అయ్యింది.
Mahesh Babu: కృష్ణా నదిలో సూపర్ స్టార్ అస్థికలు నిమజ్జనం.. విజయవాడ చేరుకున్న మహేష్ బాబు..
Superstar Krishna: లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్టు అయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అనే చేదు నిజాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. దాదాపు 350కు పైగా సినిమాలలో నటించి కోట్లాదిమంది అభిమానుల మనసు గెలుచుకున్న కృష్ణ ఈమధ్యనే గుండె పోటు కారణంగా తుది శ్వాస విడిచారు. కాగా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేయడానికి విజయవాడ చేరుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ.. కృష్ణా ప్రవాహ ప్రాంతమైన బుర్రెపాలెంలో జన్మించడంతో అయన అస్థికలను కృష్ణా నదిలో నిమజ్జనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం మహేష్ బాబు, సుధీర్ బాబు మరియు కుటుంబసభ్యులు స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో విజయవాడ చేరుకొని హిందూ శాస్త్రీయ సంప్రదాయాలతో కృష్ణ అస్థికలను నిమజ్జనం చేయనున్నారు.