Mahesh Babu: 50 సెంటర్లలో 100 రోజుల "రాజకుమారుడు"కు 22 ఏళ్ళు

Update: 2021-08-01 08:32 GMT

మహేష్ బాబు రాకుమారుడు మూవీ పోస్టర్ (ఫైల్ ఫోటో)

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది అమ్మాయిలకు కలల రాకుమారుడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా "పోరాటం" సినిమాతో బాలనటుడిగా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కొంతకాలానికి "రాజకుమారుడు" సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన మహేష్ బాబు అతి కొద్ది సినిమాలతోనే టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన "రాజకుమారుడు" సినిమా 1999 లో ఒక ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న "రాజకుమారుడు" చిత్రం 50 థియేటర్స్ లో 100 రోజులు ఆడి తెలుగు రాష్ట్రాలలో భారీగా కలెక్షన్స్ సాధించింది.

ప్రీతి జింటా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మహేష్ బాబు తన డాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఆ సినిమాతో పాటు పాటు మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి కూడా 22 ఏళ్ళు పూర్తి చేసుకావడంతో మహేష్ బాబు అభిమానులు తమ అభిమాన హీరో మొదటి సినిమాని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ అభిమానాన్ని పంచుకున్నారు. తన కెరీర్లో ఒక్కడు, పోకిరి వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టి తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేశాడు ప్రిన్స్. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ తాజాగా "సర్కార్ వారి పాట" సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Tags:    

Similar News