మహేశ్‌తో ఆ విషయంలో పోటీపడుతున్న గౌతమ్‌..!

లాక్ డౌన్ వలన ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులతో గడుపుతూ కరోనా పైన అభిమనులకి అవగాహన కల్పిస్తున్నారు.

Update: 2020-05-23 14:55 GMT

లాక్ డౌన్ వలన ప్రతిఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులతో గడుపుతూ కరోనా పైన అభిమనులకి అవగాహన కల్పిస్తున్నారు.అందులో భాగంగా మహేష్ బాబు తన కొడుకు గౌతమ్‌, కుమార్తె సితారతో కలిసి సరదాగా గడుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోతోలను మహేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా మహేశ్‌ , గౌతమ్‌తో హైట్‌ చెక్‌ చేసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గౌతమ్‌ ఎదురుగా నిల్చుని సరదాగా ఎత్తు కొలుచుకుంటున్నారు. ఆరడుగుల మహేశ్‌ ఎత్తుకు గౌతమ్‌ ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారు. 'హైట్‌ చెక్‌!! హి ఈజ్‌ టాల్, లాక్‌డౌన్‌లో కొంచెం ఫన్నీగా..' అని మహేశ్‌ పేర్కొన్నారు. ఈ వీడియోని చూసిన అభిమనులు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే, ఈ ఏడాది ఆరంభంలో 'సరిలేరునీకెవ్వరు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్‌రావిపూడి దర్శకత్వంలో మహేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం గీతాగోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నాడు మహేష్.. త్వరలో ఈ సినిమా పట్టాలేక్కనుంది. 



Tags:    

Similar News