MAA Elections: "మా" ఎన్నికల్లో నిజంగానే అవకతవకలు జరిగాయా..?

MAA Elections: వాటిని కప్పిపెట్టేందుకు విష్ణు వర్గం ప్రయత్నిస్తోందా..?

Update: 2021-10-18 13:12 GMT

ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు (ఫైల్ ఇమేజ్)

MAA Elections: "మా" ఎలక్షన్స్‌ హీట్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా ప్రమాణ స్వీకారాలు ముగిసినా.. "మా" ఎన్నికల కుంపటి మాత్రం ఆరడం లేదు. రోజుకో ట్విస్ట్‌ తెరపైకి వస్తుంది. అంతేకాదు.. వర్గాలుగా విడిపోయి ఇప్పటికీ విమర్శించుకుంటూనే ఉన్నారు. కాగా మంచు ప్యానల్‌ సభ్యులు ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేశారని సీసీ పుటేజ్‌ తమకు అందించాలని ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌ ఆరోపిస్తోంది.

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌కు వెళ్లిన ప్రకాశ్‌ రాజ్‌ పోలీసుల సమక్షంలోనే సీసీ ఫుటేజ్‌ చూపించాలని అధికారులను కోరారు. అయితే తాము అడిగిన విధంగానే సీసీ ఫుటేజ్‌ అందరి సమక్షంలోనే చూపించారన్న ప్రకాశ్‌ రాజ్‌, మిగిలిన ఏడు కెమెరాల ఫుటేజ్‌ చూపించలేదని, అది కూడా చూపించాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎన్నికల అధికారి తీరుపై ప్రకాశ్‌ రాజ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.

మొదట ఫుటేజ్‌ ఇచ్చేందుకు అంగీకరించిన అధికారి కృష్ణ మోహన్‌.. ఆతర్వాత మాట మార్చారు. ప్రోటోకాల్‌ పాటించాలని ట్విస్ట్‌ పెట్టారు. అంతేకాదు పుటేజ్‌ కావాలంటే కోర్టుకు వెళ్లాలని సూచనలు చేశారు. అదేవిధంగా రెండు ప్యానల్‌ సభ్యులు ఉండాలని కండీషన్‌ పెట్టారు. దాంతో అధికారి కృష్ణ మోహన్‌పై ప్రకాశ్‌ రాజ్‌ వర్గంలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

మొత్తానికి ఏడు కెమెరాల ఫుటేజ్‌ చూశాక ప్రకాష్‌ రాజ్‌ వర్గం మీడియా ముందుకొస్తామని అంటోంది. అటు తాము ప్రజాస్వామ్య బద్ధంగా గెలిచామని విష్ణు వర్గం అంటుంది. ఇక ప్రకాష్‌ రాజ్‌కు నెక్ట్స్‌ టైమ్‌ బెటర్‌ లక్‌ అంటున్నారు మంచు విష్ణు.

Tags:    

Similar News