OTT Movie: పొద్దున లేస్తే అదే పని చేసే ప్రేమ జంట.. ఆ వీడియో లీక్ అవ్వడంతో భారీ ట్విస్ట్

OTT Movie: ఇటీవల కాలంలో ఓటీటీలు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. రియల్ స్టోరీలతో తెరకెక్కే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.

Update: 2025-03-14 13:42 GMT

OTT Movie: పొద్దున లేస్తే అదే పని చేసే ప్రేమ జంట.. ఆ వీడియో లీక్ అవ్వడంతో భారీ ట్విస్ట్

OTT Movie: ఇటీవల కాలంలో ఓటీటీలు ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. రియల్ స్టోరీలతో తెరకెక్కే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొన్ని సినిమాలు చూస్తుంటే నిజంగా రియల్ లైఫ్ లో జరిగినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ కథనంలో చెప్పుకుంటున్న సినిమా కూడా అలాంటిదే. ఈ మూవీలో ఆకతాయిల వల్ల, అమ్మాయిల జీవితాలు చెప్పుకోలేని పరిస్థితికి వెళ్తాయి. వాళ్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఆ తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి అనేదే స్టోరీ.

ఈ సినిమా పేరు బుల్బుల్ కెన్ సింగ్. 2018 లో విడుదల అయిన ఈ అస్సామీ డ్రామాకు రీమా దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2018 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, కాంటెంపరరీ వరల్డ్ మూవీ విభాగంలో ప్రదర్శించబడింది.ఈ మూవీ స్టోరీ ముగ్గురు టీనేజర్ల చుట్టూ తిరుగుతుంది. ఒంటరిగా ఉన్న సమయంలో ప్రేమికుల వీడియోలను తీసి కొంతమంది ఆకతాయిలు వైరల్ చేస్తారు. టీనేజ్ లో మార్పులను ఈ మూవీలో చూపించారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సినిమా కథలోకి వెళితే.. బుల్ బుల్, మేఘ ఇద్దరు అమ్మాయిలు చిన్ననాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లకు బన్నీ అనే కుర్రాడు కూడా దగ్గరవుతాడు. అతడు కుర్రాడు అనేకంటే కూడా గే అనడమే బెటర్. గే ఫీచర్స్ ఎక్కువగా ఉండడంతో అతడిని అందరూ ఎగతాళి చేస్తుంటారు.ఈ అమ్మాయిలు మాత్రం అతడితో స్నేహం చేస్తారు. ఎక్కడికి వెళ్లినా కలిసి తిరుగుతుంటారు.బుల్ బుల్, సుమన్ అనే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అదే సమయంలో మేఘ కూడా వరుణ్ ప్రేమలో పడుతుంది. ఇలా ఈ జంటల ప్రేమకథ చక్కగా సాగిపోతూ ఉంటుంది. బుల్ బుల్ తండ్రి గ్రామాల్లో నాటకాలు వేస్తుంటాడు. అప్పుడప్పుడు బుల్ బుల్ కూడా పాటలు పడుతుంటుంది. ఇలా జరుగుతుండగా వీళ్ల జీవితం అనుకోకుండా ఓ మలుపు తిరుగుతుంది. సరదాగా కబుర్లు చెప్పుకోవాలని ఒక నిర్మానుష్య ప్రదేశానికి ఈ జంటలు వెళ్తారు. వీళ్లకు కాపలాగా బన్నీని పెడుతారు.

పోకిరిలు రావడంతో బన్నీ పారిపోతాడు. ఇక్కడికి వచ్చిన ఆకతాయలు వీళ్ల వీడియోలను చిత్రీకరించి అల్లరి అల్లరి చేస్తారు. అంతే కాకుండా ఆ వీడియోలను వైరల్ చేస్తారు. స్కూల్ యాజమాన్యం వీళ్లను పిలిచి ఇదేం పని అని మందలిస్తుంది. ఇంతకు ముందులా వీళ్లు సరదాగా ఉండలేకపోతారు. పరువు పోయిందని ఇంట్లో వాళ్లు బాధపడుతూ ఉంటారు. చివరికి బుల్ బుల్ పరిస్థితి ఏమవుతుందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Tags:    

Similar News