Lokesh Kanagaraj: పది సినిమాల తర్వాత రిటైర్ అవుతానన్న లోకేష్.. బన్నీ, చెర్రీలో ఎవరికి లోకేష్ హ్యాండ్ ఇవ్వనున్నాడు?

Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కెరీర్ మొదలై ఎన్నో ఏళ్లు గడవలేదు, ఇంతలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు.

Update: 2023-06-20 16:00 GMT

Lokesh Kanagaraj: పది సినిమాల తర్వాత రిటైర్ అవుతానన్న లోకేష్.. బన్నీ, చెర్రీలో ఎవరికి లోకేష్ హ్యాండ్ ఇవ్వనున్నాడు?

Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కెరీర్ మొదలై ఎన్నో ఏళ్లు గడవలేదు, ఇంతలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. 2030 లో తను సినిమాలను వదిలేయబోతున్నాడట. దీంతో ఇప్పుడు చరణ్, బన్నీ, ఎన్టీఆర్ తో అనుకున్న సినిమాలు ఉంటాయా? వాటితర్వాతే తన రిటైర్మెంటా? అంటూ ఈ చర్చ మొదలైంది. ఇంతకి తన నిర్ణయం వెనకున్న రీజనేంటి?

లోకేష్ కనకరాజ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో కేవలం పదంటే పదే మూవలు తీసి తర్వాత తప్పుకుంటా అన్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో వచ్చి, ఇలా పెద్ద సినిమాలు తీస్తున్న తాను, 2030 తర్వాత రిటైర్ కాబోతున్నట్టు తేల్చాడు. లియో అంటూ విజయ్ తో రెండో సారి సినిమా తీస్తున్న తను, ఇప్పటికే మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ అంటూ నాలుగు మూవీలు తీశాడు. లియో తో కలిపితే 5 సినిమాలు చేశాడు. అంటే తన కెరీర్ సగం పూర్తైనట్టేనా?

లియో తో కలిసి 5 సినిమాలు తీసిన లోకేష్ కనకరాజ్, మరో 5 మూవీలు తీసి తర్వాత రిటైర్ అవుతానంటున్నాడు. అలా చూస్తే నెక్ట్స్ ఆ ఐదు సినిమాలు ఎవరితో తీసినా 2029 లోపు, లేదంటే 2030 లోగా పూర్తవుతాయి. ఆలెక్కన తను మరో 7 ఏళ్లలో రిటైర్ అవటం కన్పామ్ అనేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ కి ఖైదీ తర్వాత రామ్ చరణ్ నుంచి ఆఫర్స్ వెళ్లాయి. మాస్టర్ తర్వాత బన్నీ ఛాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ కూడా తనకి ఆఫర్ పంపించాడు. కానీ విక్రమ్, లియో అంటూ అరవ అడ్డాకే పరిమితమయ్యాడు లోకేష్. మరి తన నెక్ట్స్ ఐదు సినిమాల్లో టాలీవుడ్ హీరోల మూవీలు ఉన్నాయా అనే చర్చ మొదలైంది.

మానగరంతో కెరీర్ మొదలు పెట్టిన లోకేష్ కనకరాజ్, ఇప్పటికి 5వ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆతర్వాత రజినీకాంత్ తో మూవీ చేస్తాడు. ఆవెంటనే చెర్రీ, బన్నీ, ఎన్టీఆర్ తో కూడా మూవీలు చేస్తాడని, ఐతే సూర్య తో రోలెక్స్, కార్తితో మరో మూవీ ప్లానింగ్ కూడా ఉంది. ఆలెక్కన ఏదో ఒక హీరోకి లోకేష్ హ్యాండ్ ఇవ్వొచ్చు లేదంటే 11 వ మూవీ తో కెరీర్ కి ఫుల్ స్టాప్ పడొచ్చనే అభిప్రాయం సినీజనాల్లో పెరిగింది. 

Tags:    

Similar News