Movies: అటు థియేటర్లు, ఇటు ఓటీటీలు.. మూవీ లవర్స్‌కి పండగే పండగ
Movies: ప్రతీ వారం సినిమా లవర్స్‌ని అట్రాక్ట్ చేసేందుకు సినిమాలు సందడి చేస్తుంటాయి. ఒకప్పుడు కేవలం థియేటర్లకే పరిమితమైన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి.
Movies: అటు థియేటర్లు, ఇటు ఓటీటీలు.. మూవీ లవర్స్‌కి పండగే పండగ
Movies: ప్రతీ వారం సినిమా లవర్స్‌ని అట్రాక్ట్ చేసేందుకు సినిమాలు సందడి చేస్తుంటాయి. ఒకప్పుడు కేవలం థియేటర్లకే పరిమితమైన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో కూడా అందుబాటులోకి వస్తున్నాయి. సమ్మర్ హాలీడేస్ ముగుస్తున్న తరుణంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కమల్‌హాసన్–మణిరత్నం కాంబోలో
కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ చిత్రంతో మరోసారి తెరపైకి రాబోతున్నారు. ‘నాయకన్’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటిస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. శింబు, త్రిష, అభిరామి వంటి నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
‘శ్రీశ్రీశ్రీ రాజావారు’
‘మ్యాడ్’, ‘ఆయ్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న నార్నె నితిన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. సంపద కథానాయికగా నటిస్తుండగా, సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించారు. కుటుంబానికి సంబంధించిన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రం జూన్ 6న విడుదలవుతుంది. షూటింగ్ 2022లో పూర్తైనా ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు.
హౌస్‌ఫుల్5.. నవ్వుల పండగకు సిద్దం
బాలీవుడ్‌లో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన ‘హౌస్‌ఫుల్’ సిరీస్‌లో భాగంగా ఇప్పుడు 5వ సినిమా వస్తుంది. ‘హౌస్‌ఫుల్5’లో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గిస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. జూన్ 6న థియేటర్లలోకి వస్తోంది.
మిస్టరీ థ్రిల్లర్ ‘గ్యాంబ్లర్స్’
సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’. చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఆసక్తికరమైన మలుపులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా కూడా జూన్ 6న విడుదలవుతోంది.
నవ్వుల రైడ్ ‘బద్మాషులు’
మహేశ్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వం వహించారు. ఇది పూర్తిగా కామెడీ డ్రామాగా తెరకెక్కింది. థియేటర్లలో జూన్ 6 నుంచి ఈ చిత్రం సందడి చేయబోతోంది.
ఓటీటీలో సందడి చేయనున్న ప్రాజెక్టులు ఇవే
నెట్‌ఫ్లిక్స్:
వన్ ఆఫ్ దెమ్ డేస్ (హాలీవుడ్) – జూన్ 04
జాబ్ (హిందీ) – జూన్ 05
అమెజాన్ ప్రైమ్ వీడియో:
స్టోలెన్ (హిందీ) – జూన్ 04
జియో సినీహాట్‌స్టార్:
టూరిస్ట్ ఫ్యామిలీ (తమిళ/తెలుగు) – జూన్ 02
గజానా (హిందీ) – జూన్ 02
దేవికా అండ్ డానీ (తెలుగు సిరీస్) – జూన్ 06