Lavanya Tripathi: నా పెళ్లి జరుగుతుంది కానీ..
* పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన లావణ్య త్రిపాఠి
"ఇప్పుడు నా మనసంతా అదే ఉంది అంటున్న" లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi: "అందాల రాక్షసి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి చాలా తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించింది. అయితే ఎన్ని సినిమాలు చేసినప్పటికీ లావణ్య త్రిపాఠి కి అనుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్లు మాత్రం పడటం లేదు. దీంతో దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలోనే నెట్టుకొస్తున్నప్పటికీ లావణ్య త్రిపాఠి ఖాతాలో పెద్ద చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ లు ఏమీ లేవు. దీంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న ఈమె ఇప్పుడు వెబ్ సిరీస్ ల తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
ఈ మధ్యనే లావణ్య త్రిపాఠి "పులిమేక" అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న లావణ్య త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. 2023లో ఖచ్చితంగా లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుంటుంది అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి లు ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వినిపించాయి.
తాజాగా వీటి గురించి మాట్లాడుతూ, "నా పెళ్లి గురించి చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. అది ఎందుకలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా నా పెళ్లి గురించి చెప్తాను. నా తల్లిదండ్రులు కూడా నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం లేదు. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. ప్రస్తుతానికి నాకు పెళ్లి పై ఆసక్తి లేదు. నేను ఇంకా సినిమాలలో నటించాలి అనుకుంటున్నాను. నా మనసంతా ఇప్పుడు సినిమాల మీదే ఉంది. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు ఖచ్చితంగా ఏడు అడుగులు వేస్తాను. కాబట్టి పదేపదే మీరు పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు," అని చెప్పుకొచ్చింది ఈ భామ.