Bad Girlz Teaser: డైరెక్టర్ బుచ్చిబాబు సానా చేతులమీదుగా బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు) చిత్రం టీజర్ విడుదల

Bad Girlz Teaser: ధూళిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త ఎంటర్టైనర్ ‘బ్యాడ్ గాళ్స్’ (కానీ చాలా మంచోళ్లు).

Update: 2025-12-18 11:34 GMT

Bad Girlz Teaser: డైరెక్టర్ బుచ్చిబాబు సానా చేతులమీదుగా బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు) చిత్రం టీజర్ విడుదల

Bad Girlz: ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు ఫణి ప్రదీప్ (మున్నా) ధూళిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త ఎంటర్టైనర్ ‘బ్యాడ్ గాళ్స్’ (కానీ చాలా మంచోళ్లు). అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను తాజాగా 'పెద్ది' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు.


Full View


మున్నా కథలు సుకుమార్ గారికే నచ్చేవి: బుచ్చిబాబు సానా

టీజర్ లాంచ్ సందర్భంగా బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. దర్శకుడు మున్నాతో తనకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. "మేమిద్దరం సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్స్‌గా ఉన్నప్పటి నుంచే మున్నా ప్రతిభ నాకు తెలుసు. తను రాసుకున్న కథలను సుకుమార్ గారు కూడా మెచ్చుకునేవారు. ఈ 'బ్యాడ్ గాళ్స్' కథ విన్నాను, చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎమోషనల్ గా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇందులో రేణు దేశాయ్ గారు కీలక పాత్ర పోషించారంటేనే సినిమా కంటెంట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు" అని తెలిపారు.

'జాతి రత్నాలు' రేంజ్ హిలేరియస్ ఎంటర్టైనర్: దర్శకుడు ఫణి ప్రదీప్

దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. "మా సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. 'జాతి రత్నాలు', 'మ్యాడ్' వంటి చిత్రాలను అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో.. 'బ్యాడ్ గాళ్స్' అలా ఉంటుంది. నా శ్రేయోభిలాషి బుచ్చిబాబు సానా గారు ఈ టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం" అని చెప్పారు.

సినిమా విశేషాలు:

క్రిస్మస్ రిలీజ్: డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది.

క్రేజీ కాంబో: అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు.

తారాగణం: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య తదితరులు.

నిర్మాణం: ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

ఈ టీజర్ చూస్తుంటే, ఒక సరికొత్త గర్ల్ గ్యాంగ్ కామెడీని వెండితెరపై చూడబోతున్నట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News