జూలై 14 నుంచి 20 వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తాజా చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న క్రేజీ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పూర్తి వివరాలు తెలుసుకోండి. కుబేరా, స్పెషల్ ఓప్స్ 2.0, భైరవం, డీఎన్ఏ, భూత్‌నీ ఇలా కొత్త కంటెంట్‌తో ఓటీటీ పండుగగా మారింది!

Update: 2025-07-18 06:41 GMT

Latest OTT Releases (July 14–20): New Movies and Web Series Streaming This Week on Netflix, Prime Video, ZEE5 & More

Kuberaa OTT Release – Amazon Prime Video

ధనుష్‌, నాగార్జున‌, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేరా’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా జూలై 18 నుండి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. మానవీయ విలువలు, సామాజిక స్పృహ కలిగిన కథాంశం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

Special Ops 2.0 OTT Release – Disney+ Hotstar

AI, సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న సరికొత్త స్పై థ్రిల్లర్ Special Ops 2.0, జూలై 19 నుండి Disney+ Hotstarలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ అభిమానులకు ఇది పండగే!

Bhairavam OTT Release – ZEE5

బెల్లంకొండ శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మనోజ్ నటించిన యాక్షన్ డ్రామా భైరవం మూవీ జూలై 18 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. మే 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది.

DNA (My Baby Telugu) – Jio Cinema

తమిళంలో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ DNA ఇప్పుడు తెలుగులో 'My Baby' పేరుతో జూలై 20 నుంచి Jio Cinemaలో స్ట్రీమింగ్ కాబోతుంది. అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ సినిమా, థియేటర్లలో విడుదలైన 24 గంటల వ్యవధిలోనే ఓటీటీలోకి వస్తుండటం విశేషం.

The Bhootnii – Horror Comedy on ZEE5 & ZEE Cinema

సంజయ్ దత్‌, మౌనీ రాయ్‌, సన్నీ సింగ్ నటించిన హారర్ కామెడీ The Bhootnii జూలై 18 నుంచి ZEE5 మరియు ZEE Cinemaలో అందుబాటులోకి వచ్చింది. దెయ్యాలను తరిమే బాబా పాత్రలో సంజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

International OTT Releases This Weekend

Netflix:

  1. Ami Bradley is Missing – Streaming now
  2. Untamed – Streaming now
  3. Vir Das: Full Volume – July 18
  4. Wall to Wall – July 18
  5. To Kill a Monkey – July 18
  6. I.S.S. – July 19

HBO Max:

  1. Billy Joel: And So It Goes – July 19
  2. Amazon Prime Video:
  3. The Summer I Turned Pretty (Season 3) – July 18
Tags:    

Similar News