Lakshmi Manchu : ఓ మహిళతో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు : మంచు లక్ష్మి
Lakshmi Manchu : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి పట్ల సీబీఐతో పాటుగా నార్కొటిక్స్ కంట్రోల్
Lakshmi Manchu responds to Rhea Chakraborty
Lakshmi Manchu : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి పట్ల సీబీఐతో పాటుగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే కేసులో భాగంగా నటి రియా చక్రవర్తికి ఎన్‌సీబీ ఆదివారం ఉదయం సమన్లు జారీ చేసింది. విచారణ కోసం ఆమె ఈ రోజు మధ్యాహ్నం ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి స్థానిక మీడియాని ఆమె చూట్టూ గుమిగూడారు.. వారి నుంచి ఆమె తప్పుకొని బయటకు వెళ్లేందుకు చాలా కష్టమైంది. దీంతో పోలీసులు వచ్చి ఆమెను వారి నుంచి తప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే దీనిపట్ల సినీ నటి మంచు లక్ష్మి ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఒక మహిళ ఇలాంటి పరిస్థితిని ఎదురుకోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఇది అత్యంత దారుణమని, ఓ మహిళతో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని హితవు పలికారు.. సగటు మనిషికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే నా గుండె పగులుతోంది అంటూ ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్ కి నెటిజన్లతో పాటుగా సెలబ్రిటీలు కూడా మద్దతు పలుకుతున్నారు. అటు రియాని నిన్న సుమారుగా ఆరు గంటల పాటుగా ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అందులో రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా ఉన్నాడు.
SHAME..heart wrenching .. what have we become ..#JustAsking https://t.co/wQ0WH7GwkC
— Prakash Raj (@prakashraaj) September 6, 2020