Bheemla Nayak: దుర్గవ్వ జానపదాలకు ఫిదా అవుతున్న పవన్ ఫ్యాన్స్..
Bheemla Nayak: ఆమె ఓ నిరుపేద, పొలం పనులు చేసుకుంటూ ఏరువాక పాటలు పాడేది.
Bheemla Nayak: దుర్గవ్వ జానపదాలకు ఫిదా అవుతున్న పవన్ ఫ్యాన్స్..
Bheemla Nayak: ఆమె ఓ నిరుపేద, పొలం పనులు చేసుకుంటూ ఏరువాక పాటలు పాడేది. తనలో ఉన్న ప్రతిభను గుర్తించి జానపద గేయాలు పాడేందుకు అవకాశం కల్పించారు స్థానిక కళాకారులు. ఆమె పాడిన రెండు జానపద గేయాలు వైరల్ అవ్వడంతో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌లో అడవి తల్లి అనే పాట పాడే అవకాశం ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. దుర్గవ్వ భీమ్లా నాయక్‌లో పాడిన పాట ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. గతంలోనూ ఈమె తెలుగుతోపాటు మరాఠీలోనూ అనేక పాటలు పాడింది.