జిగ్రీస్ లో అదరగోట్టిన కృష్ణ బూరుగుల.. చిచోర్ పాత్రలో మెప్పించిన వైనం!
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'క్రష్' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు కృష్ణ బూరుగుల, ఇప్పుడు తన తాజా చిత్రం 'జిగ్రీస్'తో మంచి విజయాన్ని అందుకుని హాట్ టాపిక్‌గా మారారు.
జిగ్రీస్ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న కృష్ణ బూరుగుల.. చిచోర్ పాత్రలో మెప్పించిన వైనం!
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'క్రష్' సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు కృష్ణ బూరుగుల, ఇప్పుడు తన తాజా చిత్రం 'జిగ్రీస్'తో మంచి విజయాన్ని అందుకుని హాట్ టాపిక్‌గా మారారు. అంతకుముందు దిల్ రాజు నిర్మించిన 'ATM' వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించిన కృష్ణ, దర్శకుడు కొరటాల శివ నిర్మించిన 'కృష్ణమ్మ' చిత్రంలోనూ ప్రధాన పాత్ర పోషించి ఆకట్టుకున్నారు.
'జిగ్రీస్' హిట్‌తో కృష్ణ సంచలనం
తాజాగా, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'జిగ్రీస్' చిత్రంలో కృష్ణ బూరుగుల లీడ్ రోల్‌లో నటించారు. ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా ట్రైలర్‌ను 'స్పిరిట్' చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేసి చిత్ర బృందానికి మద్దతు తెలిపారు.
నటన మానేస్తానని ఛాలెంజ్!
'జిగ్రీస్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా వచ్చిన సందీప్ రెడ్డి వంగా ముందు కృష్ణ బూరుగుల చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు వైరల్ అవుతోంది. "ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించకుంటే తాను నటన మానేస్తానని" ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, డీజే టిల్లు మరియు జాతి రత్నాలు మాదిరిగా 'జిగ్రీస్' సినిమా ప్రేక్షకులను నవ్విస్తుందని కూడా ఆయన ముందే ధీమా వ్యక్తం చేశారు.
నటనకు ప్రశంసలు: అందుకు తగ్గట్టుగానే, 'చిచోర్' పాత్రలో కృష్ణ బూరుగుల సినిమాను ఆసాంతం తన భుజాలపై మోశారు. ముఖ్యంగా తనదైన కామెడీ టైమింగ్‌తో థియేటర్‌లో నవ్వులు పూయించారు. ఎమోషన్ సీన్స్‌లోనూ ఆయన నటన మెప్పించింది.
ప్రేక్షకుల ఆదరణ: డిఫరెంట్ స్లాంగ్‌తో కూడిన కృష్ణ నటనకు ఆడియన్స్‌తో పాటు సినీ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకున్న కృష్ణ బూరుగుల, రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది.