Kothapallilo Okappudu: రానా దగ్గుబాటి & ప్రవీణ పరుచూరి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' విలేజ్ ప్లే ఫుల్ రైడ్ టీజర్ రిలీజ్

Kothapallilo Okappudu: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, మీనింగ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ సినిమాలకి సపోర్ట్ ని కంటిన్యూ చేస్తోంది. ఈసారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది.

Update: 2025-07-04 13:30 GMT

Kothapallilo Okappudu: రానా దగ్గుబాటి & ప్రవీణ పరుచూరి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' విలేజ్ ప్లే ఫుల్ రైడ్ టీజర్ రిలీజ్

Kothapallilo Okappudu: రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, మీనింగ్ ఫుల్ ఎంటర్ టైనింగ్ సినిమాలకి సపోర్ట్ ని కంటిన్యూ చేస్తోంది. ఈసారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' రూరల్ కామెడీ ఎంటర్టైనర్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తోంది. నటి, నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పల్లెటూరి జీవితాన్ని, సరదాలని అద్భుతంగా చూపించబోతోంది.

గాసిప్‌తో సందడి చేసే పల్లెటూరి నేపథ్యంలో సాగే కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ కలలు, విలేజ్ డ్రామా ఒకదానితో ఒకటి కలిసిపోయే వరల్డ్ పరిచయం చేస్తుంది. మనోజ్ చంద్ర రికార్డ్ డ్యాన్స్ స్టూడియోని నడుపుతున్న యువకుడిగా కనిపించాడు. అతను డ్యాన్స్ పార్ట్నర్ కోసం వెదుకుతున్నప్పుడు ఊహించని సమస్యలలో చిక్కుకుంటాడు.

కొత్తపల్లిలో ఒకప్పుడు రిఫ్రెష్‌గా ఉండే రస్టిక్ టోన్ లో ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ పెట్రోస్ ఆంటోనియాడిస్, గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చూపించాడు. మణిశర్మ సంగీతం సమకూర్చగా, వరుణ్ ఉన్ని అందించిన నేపథ్య సంగీతం టీజర్‌ ఫన్ ని ఎలివేట్ చేసింది.

ఈ చిత్రంలో మోనికా టి, ఉషా బోనెల కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. టీజర్‌లో పెర్ఫార్మెన్స్ లో చాలా నేచురల్ గా ఆకట్టుకున్నాయి.

గురుకిరణ్ బత్తుల కథ, సంభాషణలను అందించారు. డైరెక్టర్ ప్రవీణ పరుచూరి నెరేటివ్ కి చక్కని సున్నితత్వాన్ని తీసుకువచ్చారు.

టీజర్ అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది.


Full View


Tags:    

Similar News