చెన్నై నుంచి ముంబై వెళ్ళిపోతున్న సూర్య
Suriya: చెన్నై నుంచి ముంబై వెళ్ళిపోతున్న స్టార్ హీరో
ముంబై కి షిఫ్ట్ అయిపోతున్న కోలీవుడ్ స్టార్
Suriya: ఈమధ్య ఒక భాషలో స్టార్డం తెచ్చుకున్న నటీనటులు బాలీవుడ్ లో కూడా తమ సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లి సెటిల్ అవుతున్నారు. కొంతమంది పూర్తిగా ముంబైకి షిఫ్ట్ అయిపోతుంటే మరికొందరు మాత్రం ముంబైలో కూడా ఇల్లు కొనుక్కొని వెళుతూ ఉన్నారు.
తాజాగా ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం సూర్య ఇప్పటికే ముంబైలో 70 కోట్లు పెట్టి ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ని కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన భార్య జ్యోతిక తో పాటు సూర్య ముంబై కి షిఫ్ట్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. దియా మరియు దేవ్ అని సూర్య మరియు జ్యోతిక కి ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. వారు కూడా వీరితోపాటే ముంబైకి వెళ్ళిపోబోతున్నారు.
ఒక గేటెడ్ కమ్యూనిటీలో బాలీవుడ్ స్టార్లు పొలిటీషియన్లు ఉండే ఒక్క కాస్ట్లీ ఏరియాలో సూర్య అపార్ట్మెంట్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమాల పరంగా చూస్తే సూర్య ప్రస్తుతం తన 42వ సినిమాతో బిజీగా ఉన్నాడు. సిరుతయ్ శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పతాకంపై జ్ఞానవెల్ రాజా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశ పఠాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్యాన్ ఇండియా రేంజి లో ఈ సినిమా ఏకంగా 10 భాషల్లో విడుదల కాబోతోంది.